Sunday, April 28, 2024

Pooja Hegde : ముచ్చ‌ట‌గా మూడోసారి బుట్ట‌బొమ్మ‌..

పూజా హెగ్డే పేరు తెలియని వారుండరు. బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ అంటూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో అనతి కాలంలోనే అగ్రహీరోలందరితో నటించి మంచి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అల్లుఅర్జున్‌తో ఈ అమ్మడు నటించిన రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి.

- Advertisement -

దువ్వాడ జగన్నాధమ్‌, అల వైకుంఠపురం సినిమాతో మంచి సక్సెస్‌ను చవిచూసింది ఈ బ్యూటీ. అయితే, అమ్మడుకి అలవైకుంఠపురం సినిమా తర్వాత హిట్ దొరకలేదు. ఆ చిత్రం తర్వాత ప్రభాస్‌తో సినిమా చేసిన అది అనుకున్న ఫలితాన్ని అందించలేదు. తాజాగా ఈ బ్యూటీ మరోసారి ఐకాన్‌స్టార్ అల్లుఅర్జున్‌తో జోడికట్టనుంది. అయితే, వీరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి మరో హిట్ పడనుందని సినీ వర్గాల్లో టాక్‌.

అల్లుఅర్జున్ పుష్ప2 చిత్రీకరణలో ఫుల్ బిజిగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ మరో మూడు సినిమాలకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఇందులో ఒక‌ చిత్రంలో బన్నీ సరసన బుట్టబొమ్మ నటిస్తుందనే టాక్ టీ టౌన్ వర్గాల్లో తెగ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement