Friday, May 3, 2024

బ‌న్నీ బ‌ర్త్ డే.. అన‌సూయ స్పెష‌ల్ విషెష్

నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు. కాగా పుష్ప చిత్రంలో యాంక‌ర్..న‌టి అన‌సూయ ముఖ్య పాత్ర‌లో న‌టించింది. మంగళం శ్రీను (సునిల్) భార్యగా దాక్షాయణి పాత్రలో వేరియేషన్ చూపించింది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డే కావడంతో తన కోస్టార్‌కు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్ తెలియజేసింది అన‌సూయ‌.టాలెంటెడ్ యాక్టర్ అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి పాత్ర, కథనం కోసం మిమ్మల్ని మీరు మార్చుకునే విధానం ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది!! పుష్ప గాడి రులు కోసం ఎదురు చూస్తున్నా!! అంటూ ట్వీట్ చేసింది అనసూయ. ఈ ట్వీట్ చూసిన బన్నీ అభిమానులు పాజిటివ్‌గా రెస్పాన్స్ అవుతున్నారు. ఇదే క్రమంలో ఒక యూజర్.. అను బేబీ ఎలా ఉన్నావ్. ఈ మధ్య ఆన్‌లైన్‌కు ఎక్కువగా రావడం లేదేంటి అని కామెంట్ చేశాడు. సినిమాల విషయానికొస్తే.. పుష్ప2లో తన పాత్రకు మరింత ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది. ద‌ర్శ‌కుడు సుకుమార్ తన క్యారెక్టర్‌ను ఎలివేట్ చేసేలా సీన్లు రాసుకున్నారట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement