Monday, May 6, 2024

Avantika:హాలీవుడ్ న‌యా సంచ‌ల‌నం బ్ర‌హ్మోత్స‌వ్ అవంతిక

అవంతిక వందనపు.. బ్ర‌హ్మోత్స‌వంలో బాల‌న‌టిగా ఇచ్చిన ఈ చిన్నారి ఇప్పుడు ఇండియన్ వైడ్ గా ఈ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అవంతిక ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. అమెరికన్ యాక్సెంట్ లో గలగల మాట్లాడుతూ అదరగొడుతున్న ఈ చిన్నది అచ్చు తెలుగు అమ్మాయి.

అయితే ఇప్పుడు హాలీవుడ్ లో నటిగా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయింది. తాజాగా హాలీవుడ్ లో మీన్ గర్ల్స్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో అవంతిక లీడ్ రోల్ లో నటించింది. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయినా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో అవంతిక చేసిన సందడితో ఒక్కసారిగా వైరల్ గర్ల్ గా మారింది.

ఇక ఇన్ స్టాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అవంతిక తన గ్లామర్ ఫోటోలని రెగ్యులర్ గా షేర్ చేస్తోంది. అదిరిపోయే లుక్స్, హాట్ ఫోజులుతో కట్టిపడేస్తోంది. రీసెంట్ గా అమ్మడు గ్లామరస్ డ్రెస్సులో అమ్మడు స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. చూస్తుంటే అమ్మడు రాబోయే రోజుల్లో మరీంత డోస్ పెంచేలా కనిపిస్తోంది. ఇండియన్ సినిమాలలో కూడా అవంతికని హీరోయిన్ గా తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement