Tuesday, May 7, 2024

బోయ‌పాటితో రామ్ ఊర‌మాస్.. టీజ‌ర్ అదుర్స్

యాక్ష‌న్ మూవీస్ కి పెట్టింది పేరు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి. కాగా ఆయ‌న‌ హీరో రామ్ తో ఓ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. నేడు రామ్ బ‌ర్త్ డే.దాంతో ఆయ‌న‌కి గిఫ్ట్ గా బోయ‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం నుండి ఫ‌స్ట్ థండ‌ర్ పేరుతో టీజ‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఇంకా టైటిల్ కూడా ఖరారు కాకముందే ఈ టీజర్ తో సినిమాపై కావలసినంత హైప్ వచ్చేసింది. తమన్ ఎప్పటిలాగే మాస్ బిజియంతో మోతెక్కించారు. ఓవరాల్ గా బోయపాటి రామ్ బర్త్ డేకి సాలిడ్ గిఫ్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఈ చిత్రంలో రామ్ కి జోడిగా శ్రీలీల నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో తమన్ సంగీత దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కెరీర్ లో తొలిసారి రామ్ ఈ చిత్రం కోసం స్టయిలిష్ లుక్ పక్కన పెట్టాడు. బాగా బొద్దుగా మారి రగ్గడ్ లుక్ లో ఊరమాస్ గెటప్ లో దర్శనం ఇస్తున్నాడు. ఈ టీజర్ అదిరిపోయింది. దున్నపోతుని పట్టుకుని రామ్ ఇచ్చిన ఎంట్రీ మాస్ ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ లాగా ఉంది. నీ స్టేటు దాటలేనన్నావ్ దాటా .. నీ గేటు దాటలేనన్నావ్ దాటా, నీ పవర్ దాటలేనన్నావ్ దాటా.. ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్సు అంటూ రీ సౌండ్ వచ్చేలా రామ్ చెబుతున్న డైలాగ్ ఉరుము ఉరిమినట్లుగానే ఉంది. బోయపాటి మార్క్ యాక్షన్ బ్లాక్స్ టీజర్ లో కనిపిస్తున్నాయి. రామ్ శత్రువులని పిడిగుద్దులు గుద్దుతూ వెంటాడుతున్నాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement