Friday, May 3, 2024

పాస్ట‌ర్ ఘాతుకం – బొందితో కైలాసం…201 మంది బ‌లి

కన్యా: బొందితో స్వర్గానికి చేరుస్తానంటూ కెన్యాలో ఒక పాస్టర్‌ చేసిన ప్రచారా నికి 201 మంది బలైపోయారు. ఇంతటి ఘాతుకానికి కారణమైన గుడ్‌న్యూస్‌ ఇంటర్నేషనల్‌ చర్చి చీఫ్‌ పాల్‌ మెకెంజీకి కెన్యాలో ఒక కోర్టు బెయిల్‌ నిరాకరిం చింది. ప్రపంచం అంతం కావడానికి ముందు సరాసరి స్వర్గానికి చేరుకుంటా రంటూ మభ్యపెట్టడం ద్వారా వందలాదిగా అనుచరులు, వారి పిల్లలు ఆహారం తీసుకోకుండా ఆకలి దప్పులతో మరణించడానికి కారణమయ్యాడనే అభియో గంపై పాల్‌ మెకెంజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దేశంలోనే అత్యంత పెను విషాదానికి షకహోలా అడవి వేదికగా మారింది. తాజాగా అటవీ ప్రాంతంలో మరో 22 మంది మృతదేహాలను వెలికితీయడంతో మృతుల సంఖ్య 201కి చేరుకుందని ప్రాంతీయ కమిషనర్‌ రోడా ఓన్‌యాంచా మీడియా కు తెలిపారు. కేసుకు సంబంధించి మరో అనుమానితుని అరెస్టు చేసినట్టు చెప్పారు. దీంతో కేసులో అరెస్టయినవారి సంఖ్య 26కు చేరుకుందని ఆమె తెలి పారు. గడచిన వారం రోజులుగా అడవి అంతటా ఏర్పాటు చేసిన సమాధులను తవ్వి మరీ అధికారులు శవాలను వెలికితీశారు. వందలాదిగా ప్రజలు ఇంకా కనిపించడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement