Wednesday, May 1, 2024

సొంత ఇంటిని అమ్మేసిన బాలీవుడ్ స్టార్ ?

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ కొడుకు అభిషేక్ బచ్చన్ తన ఇంటిని విక్రయించడం ఇప్పుడు బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది. ముంబైలో ఉన్న తన లగ్జరీ అపార్ట్ మెంట్ ను విక్రయించారు. తన పాత అపార్ట్మెంట్లలో ఒకదాన్ని 45. 75 కోట్లకు విక్రయించారు. అభిషేక్ బచ్చన్ ఇల్లు ఒబేరాయ్ 360లో 37 వ అంతస్తు లో ఉంది.

ఇదే భవనంలో షాహిద్ కపూర్, అక్షయ్ కుమార్ లకు కూడా అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే అభిషేక్ ఇంటికి ఎందుకు విక్రయించాడనేది ఎవరికీ తెలియరాలేదు. ఇక ఈ ఏడాది మేలో అభిషేక్ బచ్చన్ ఓ డూప్లెక్స్ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశారు. దాని విలువ 31 కోట్లుగా సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement