Friday, May 17, 2024

Sai Manjrekar:బ్లాక్ కోబ్రో… సాయి మంజ్రేక‌ర్

మ‌హేష్ మంజ్రేక‌ర్ వార‌సురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి మంజ్రేక‌ర్ జ‌ర్నీ తొలుత అమ్మ‌డు మ‌రాఠీ చిత్రంతో లాంచ్ అయింది. అటుపై ‘ద‌బాంగ్ -3’ తో బాలీవుడ్ లో ప్ర‌వేశించింది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో టాలీవుడ్ లో ‘గ‌ని’ లో న‌టించే ఛాన్స్ అందుకుంది. బోయ‌పాటి ‘స్కంద‌’లోనూ అవ‌కాశం క‌ల్పించింది.

కానీ ‘స్కంద’ ఫ‌లితం మ‌ళ్లీ అమ్మ‌డిని వెన‌క్కి లాగి పెట్టింది. ప్ర‌స్తుతానికి తెలుగులో ఛాన్సులైతే లేవుగానీ..హిందీలో మాత్రం ఓ రెండు సినిమాలు చేస్తుంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ సాయి మంజ్రేక‌ర్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోలు పోస్ట్ చేసి యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంది. ఫిట్ నెస్ ప్రీక్ అని ఇప్ప‌టికే చాలా వీడియోల‌తో ప్రూవ్ చేసింది అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు తాను దూరం అంటూనే హృదయాల్ని ఛిద్రం చేయ‌డం అన్న‌ది అమ్మ‌డికి మాత్ర‌మే తెలిసిన టెక్నిక్ . తాజాగా బ్లాక్ డిజైన్ ఔట్ ఫిట్ శారీతో త‌ళ‌కులీనింది. ఇదిగో ఇక్క‌డిలా బ్లాకో కోబ్రో పోలిన డిజైన్ లో కెమారాకి ఫోజులిచ్చింది. పోటో బ్లాక్ వైట్ లో ఉన్న అందం చంద‌మామలా వెలిగిపోతున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement