Tuesday, November 28, 2023

AP: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభ‌త్సం సృష్టించాయి. జిల్లాలోని వి.కోట మండలంలో గజరాజుల గుంపు బీభత్సం సృష్టించింది. తోట కనుమ, గోనమాకులపల్లి, నాగిరెడ్డిపల్లి, బోయకొండలో పలు పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి.

- Advertisement -
   

గజరాజుల సంచారం నేపథ్యంలో స్థానిక గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఏనుగులు సృష్టించిన బీభత్సంతో సుమారు రూ.లక్షల్లో పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి తమను, తమ పంట పొలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement