Sunday, April 28, 2024

బింబిసార ఓటీటీ రిలీజ్.. అఫీషియల్​ డేట్​ వెల్లడించిన మేకర్స్

క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించిన బింబిసార సినిమా బిగ్గెస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. సోషియో ఫాంట‌సీ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ మ‌ల్లిడి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. క‌ళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన‌ బింబిసార సినిమా దీపావ‌ళి కానుక‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది. దీనికి సంబందించి అఫీషియ‌ల్‌ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ నెల (అక్టోబ‌ర్) 21న జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్నట్టు వెల్లడించారు. ఈ విష‌యాన్ని జీ5 ఓటీటీ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement