Thursday, May 2, 2024

నిఖిల్ ‘స్పై’ నుండి రేపు బిగ్ అప్‌డేట్‌.. ప్ర‌క‌టించిన మేక‌ర్స్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ అప్ క‌మింగ్ పాన్ ఇండియన్ మైవీ SPY. కాగా ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమాని ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై కె రాజశేఖర్ రెడ్డి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కాగా, ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్. రేపు ఈ సినిమా రిలీజ్ డేట్ అండ్ లోగో రివీల్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

- Advertisement -

అందుకోసం ఒక స్పెష‌ల్ పోస్ట‌ర్ ని కూడా రిలీజ్ చేశ‌రు మేక‌ర్స్. “Ready to unfold #IndiasBestKeptSecret.. Do you know what it is?. #SPY Release Date & Logo Announcement Tomorrow” అనే క్యాప్షన్‌తో ఈ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు. ఇక‌ నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో.. నిఖిల్ కెరీర్ లోనే ఈ సినిమా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా కోసం అమెజాన్, స్టార్ నెట్‌వర్క్ 40 కోట్లు చెల్లించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement