Thursday, May 2, 2024

ఆస‌క్తిక‌రంగా.. భువ‌న విజ‌య‌మ్ ట్రైల‌ర్

హీరో సునీల్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం భువ‌న విజ‌య‌మ్.ఈ మూవీ ట్రైల‌ర్ ని రీలిజ్ చేశారు మేక‌ర్స్. మొత్తానికి ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది. మే12న ‘భువన విజయమ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సునీల్ శ్రీనివాస్ రెడ్డి వెన్నెల కిషోర్ ధనరాజ్ థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ జబర్దస్త్ రాఘవ షేకింగ్ శేషు గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘భువన విజయమ్’ సినిమాను శ్రీమతి లక్ష్మీ సమర్పణలో హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్ బ్యానర్ పై కిరణ్ వీఎస్కే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ యలమంద చరణ్ దర్శకత్వం వహించారు. కాగా ఈ ట్రైలర్ లో భువన విజయమ్ కథాంశాన్ని చాలా ఆసక్తికరంగా రివిల్ చేసింది చిత్ర యూనిట్. ఫన్ ఎమోషన్ సస్పెన్స్ థ్రిల్ లాంటి అన్ని ఎలిమెంట్స్ ను ట్రైలర్ లో చూపించారు. సునీల్ తన వింటేజ్ తరహా కామెడీతో మరోసారి ఆకట్టుకోనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అలాగే సునీల్ ను సీరియస్ మోడ్ లోనూ గమనించవచ్చు. మొత్తంగా ఈ మూవీ అన్ని భావోద్వేగాలను టచ్ చేసేలా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కంటెంట్ రెగ్యులర్ కి భిన్నంగా ఉందని ట్రైలర్ భరోసా ఇచ్చింది. శేఖర్ చంద్ర బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గ్రిప్పింగా ఉంది. నిర్మాణ విలువలు జోనర్ కి తగ్గట్టుగా ఉన్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement