Saturday, April 20, 2024

భోళాశంక‌ర్.. సాయంత్రం మాస్ బీట్ సాంగ్

ప్రస్తుతం భోళా శంకర్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.ఇప్పటివరకు రిలీజైన పోస్టర్‌లు మంచి అంచనాలే క్రియేట్‌ చేశాయి. ఈ సినిమాను అగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తు్ంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను ఆదివారం రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. కాగా తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజయ్యే టైమ్ ను చిత్రబృందం వెల్లడించింది. భోళా మేనియా అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ ను సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మహతి స్వర సాగర్ స్వర పరిచిన ఈ పాటను రామ జోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించాడు. ఇప్పటికే రిలీజైన ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా ఫ్యాన్స్ వేయిట్ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement