Monday, September 25, 2023

సురక్ష దినోత్సవాల్లో..బతుకమ్మ ఆడిన మహిళా కానిస్టేబుల్స్

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆదివారం జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి నేతృత్వంలో పోలీస్ శాఖ సురక్షా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పెట్రో కార్ – బ్లూ కోర్ట్ ర్యాలీ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రక్షణ శాఖ పట్ల ఎంతో శ్రద్ధ చూపడం చాలా సంతోషదాయకం అన్నారు. దేశ నేరవిభాగా నియంత్రణలో 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. నేడు ప్రతి పొలిస్ స్టేషన్ కి నూతన వాహనాలు అందించి అవాంఛనీయ సంఘటనలకు చెక్ పెట్టిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. పెట్రో బైక్ లు,హైవే పెట్రో కార్ లు ద్వారా పోలీస్ శాఖ చాలా ప్రమాదాలు అరికడుతోందన్నారు. రాష్ట్ర రాజధాని వేధికాగా పోలీస్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి నేర నియంత్రణలో రాష్ట్రం అగ్రగ్రామీగ నిలిచిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదన్నారు.

- Advertisement -
   

పెరుగుతున్న జనాభా, నేరాలు, సైబర్ క్రైమ్ వంటి సాంకేతికతో ముడిపడి ఉన్న నేరాల వంటి సవాళ్ళను ఎదుర్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధమై ఉందన్నారు. మహిళల భద్రత విషయంలోనూ హోం శాఖ పటిష్ట కార్యాచరణను అమలు చేస్తున్నదన్నారు. ఈ వేడుకల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ దివాకర్, జిల్లా ఎస్పీ జే సురేందర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, డిఎస్పీ లు రాములు, రాం మోహన్ , జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్ఐలు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ బుర్ర రమేష్, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ కల్లెపు శోభ, మున్సిపాలిటీ చైర్ పర్సన్ వెంకట రాణి,వైస్ చైర్మన్ హరిబాబు,కౌన్సెలర్లు,ఇతర అధికారులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement