Thursday, May 2, 2024

భోళా శంక‌ర్.. ఎన‌ర్జిటిక్ సాంగ్ షూట్

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం భోళా శంక‌ర్..రీసెంట్ గా భోళా మానియాతో వ‌చ్చిన ఈ చిత్ర టీం.. ఇప్పుడు మరో సాంగ్ అప్‌డేట్ ఇచ్చింది. హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్‌లో మెగాస్టార్ చిరంజీవి.. తమన్నా, కీర్తిసురేశ్ కాంబోలో వచ్చే ఎనర్జిటిక్‌ సాంగ్‌ను షూట్‌ చేస్తున్నారట‌. శేఖర్‌ వీజే ఈ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. భోళా శంకర్ లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, పీ రవి శంకర్‌, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.వేదాళ‌మ్ రీమేక్‌గా వ‌స్తున్న భోళా శంక‌ర్‌ ఇటీవలే కోల్‌కతాలోని అందమైన లొకేషన్లలో షూటింగ్‌ జరుపుకుంది. దీనికి సంబంధించిన స్టిల్స్ కొన్ని ఇప్పటికే నెట్టింట హల్‌ చల్‌ చేస్తున్నాయి. స్విట్జర్లాండ్‌లో తమన్నా, చిరుపై వచ్చే సాంగ్‌ కూడా షూట్ చేశారు.భోళా శంకర్ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement