Thursday, May 2, 2024

బాహు భాషా చిత్రం భార‌తీయ‌న్

నీరోజ్‌ పుచ్చా, సోనమ్‌ -టె-ండప్‌, సుభా రంజ న్‌, హీరోలుగా సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్‌ నాంగ్యాల్‌ హీరోయిన్లుగా నటించిన బహు భాషా చిత్రం ‘భారతీయన్స్‌’. ప్రవాస భారతీయుడు డాక్టర్‌ శంకర్‌ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. రచయిత దీన్‌ రాజ్‌ (ప్రేమించుకుందాం రా, కలిసుం దాం రా ఫేమ్‌) ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం టీ-జర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు రిలీజ్‌ చేసి, చిత్ర యూనిట్‌ కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. దీన్‌ రాజ్‌ దర్శకుడిగా పరిచయమ వుతున్న భారతీయన్స్‌ బిగ్గెస్ట్‌ బ్లస్టర్‌ కావాలని ఆకాంక్షించారు.
దర్శకుడు దీనరాజ్‌ మాట్లాడుతూ ”దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. మా నిర్మాతకు కూడా దేశభక్తి ఎక్కువ. శంకర్‌ గారు అమెరికాలో డాక్టర్‌. కథ నచ్చి సినిమా నిర్మిం చేందుకు ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించే చిత్రమిది. అని అన్నారు!!
హీరోలలో ఒకరైన నీరోజ్‌ మాట్లాడుతూ ”హీరోగా నాకు తొలి సినిమా ఇది. అని అన్నారు. త్వ రలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఫైట్స్‌: జూడో రాము,, సినిమాటోగ్రఫీ: జయపాల్‌ రెడ్డి నిమ్మల, సంగీతం : సత్య కశ్యప్‌, కపిల్‌ కుమార్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement