Thursday, May 2, 2024

“భగవంత్‌ కేసరి” హై యాక్షన్‌

నందమూరి బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌ చిత్రం ‘భగవంత్‌ కేసరి’ . సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.

ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాతీయ పురస్కార నటుడు అర్జున్‌ రాంపాల్‌ తన పాత్రని పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రంలో అతని పాత్ర పేరు రాహుల్‌ సంఘ్వి అని చిత్ర బృందం తెలిపింది. మేకర్స్‌ ఈ సందర్భంగా విడుదల చేసిన చిత్రాల్లో అర్జున్‌ రాంపాల్‌, బాలకృష్ణ, అనిల్‌ రావిపూడి ఉన్నారు.

‘భగవంత్‌ కేసరి’ యునిక్‌ కాన్సెప్ట్‌ తో హై యాక్షన్‌ గా వుంటు-ంది. బాలకృష్ణను వైవిధ్యమైన పాత్రలో దర్శకుడు అనిల్‌ రావిపూడి చూపించను న్నారు. ఇప్పటికే విడుదలైన టీ-జర్‌ మంచి స్పందన వచ్చింది. బాలకృష్ణ తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం ఎంతగానో అలరించింది.

ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సి రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్‌ తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement