Monday, April 29, 2024

‘భగవంత్ కేసరి’ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్.. ఓటీటీలో వచ్చేది అప్పుడే!

నందమూరి బాలకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో అనిల్ రావిపూడి దర్శకత్వం వ‌హించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. ద‌స‌రా కానుక‌గా ఇవ్వాల (అక్టోబర్ 19న) థియేట‌ర్ల‌లో గ్రాండ్ గా రిలీజ్ అయిన‌ ఈ మూవీ.. ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ విషయం పై లేటెస్ట్ బ‌జ్ ఓక్క‌టి న‌డుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన 50 రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం.

అయితే, ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు దాదాపుగా రాయలసీమ నేపథ్యంలోనే సాగేవి. కాగా, ఈ సినిమా మాత్రం తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కింది. ‘వేములవాడ భీమకవి’, ‘నిప్పు రవ్వ’ తర్వాత బాలయ్య నటించిన తెలంగాణ నేపథ్య సినిమా ఇదే. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ నటించగా.. శ్రీలీల ఒక ముఖ్య పాత్రలో కనిపించింది. ఇక థమన్ త‌న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆక‌ట్టుకున్న‌డు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement