Tuesday, April 30, 2024

అందం, అభినయం, అవకాశాలు ఆమె సొంతం.. శ్రీ‌లీల డేట్స్ కోసం డైరెక్ట‌ర్ల వెయిటింగ్‌!

తొలి సినిమా హిట్‌ కాకపోతే ఆ తర్వాత వచ్చే అవకాశాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ కొందరికో మాత్రం ఇది మినహాయింపు. తొలి సిని మా ఫలితంతో సంబంధం లేకుండా అవకాశాలు తలుపుతడు తుంటాయి. ఆ కేటగిరిలో ‘పెళ్లిసందడి’ ఫేమ్‌ శ్రీలీల ఉంది. దర్శకేంద్రుడి స్కూల్‌ నుండి వచ్చిన ఈ భామ డేట్స్‌ కోసం నిర్మాతలు వెంటపడు తున్నారు. అచ్చమైన తెలుగు అమ్మాయి కావడం, అందం, చలాకితనం, అభిన యం ఇవన్నీ శ్రీలీల సొంతం. మాస్‌ ప్రేక్షకు లను ఇట్టే ఆకట్టుకునే ఆమె చూపు ప్రేక్షకు లను కట్టిపడేస్తుంది.

అందుకే యువతలో క్రేజ్‌ ఉందని నిర్మాతలు అంటున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది సినిమా లున్నాయి. రవితేజ ధమాకాలో నటి స్తోంది. ఇంకా అనగనగా ఒక రాజు, వైష్ణవ్‌ తేజ్‌ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలకు సైన్‌ చేసింది. తాజాగా సిద్దూ జొన్నలగడ్డ పక్కన నటించనుందని సమాచారం. డిజే టిల్లు సినిమాతో స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న ఆయన పార్ట్‌ 2గా తెరకెక్కిస్తున్న డిజే టిల్లులో శ్రీలీల నటిస్తుందని సమాచారం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌ మొదలవుతుంది. రవితేజ మినహాయిస్తే యువహీరోలతో కలిసి నటిస్తున్న శ్రీలీల త్వరలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ అవుతుందని, అగ్ర హీరోల తో అవకాశాలు దక్కించుకుంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement