Monday, April 29, 2024

త‌ళపతి విజయ్ బీస్ట్ అనౌన్స్ మెంట్ – సెకండ్ సింగిల్ రిలీజ్

అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో త‌ళపతి విజ‌య్ న‌టిస్తున్న‌ యాక్షన్ డ్రామాగా బీస్ట్ తెర‌కెక్కుతోంది. తమిళ చిత్రసీమలో బీస్ట్ మ‌రో పెద్ద సంచ‌ల‌నంగా మార‌నుంది. మూవీ విడుదలకు తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో మేకర్స్ స్టైల్‌గా ప్రమోషన్‌లను తిరిగి ప్రారంభించారు.. బీస్ట్ రెండవ సింగిల్ మార్చి 19న విడుదల చేయ‌నున్న‌ట్టు అనౌన్స్ మెంట్ చ‌శారు.

బీస్ట్ రెండవ సింగిల్ ‘జాలీ ఓ జింఖానా’ అని టైటిల్ తో ఒక చిన్న ప్రోమో వీడియో రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ పాట‌ని త‌ళ‌ప‌తి విజ‌య్ స్వ‌యంగా పాడ‌టం విశేషం. అభిమానుల ఉత్సుకతను రేకెత్తిస్తూ, అద్భుతంగా కనిపించే ఈ సెకండ్‌ సింగిల్ ఫుల్ సాంగ్ శనివారం సాయంత్రం (మార్చి 19) 6 గంటలకు యూట్యూబ్, ఇతర ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement