Sunday, April 28, 2024

బ‌లగం మూవీకి మ‌రో నాలుగు అంత‌ర్జాతీయ అవార్డులు

టాలీవుడ్ నటుడు ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన జంటగా నటించిన ఇటీవల సెన్సేషన్ మూవీ బలగం అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై అవార్డుల పంట‌పండించుకుంటున్న‌ది..మూవీ విడుద‌లై నాలుగు వారాలు పూర్తి అయినా నేటి వ‌ర‌కూ క‌లెక్ష‌న్ డ్రాపౌట్ కాకుండా విజ‌య‌వంతంగా దూసుకుపోతున్న‌ది.. ఇటు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు,అటు అంత‌ర్జాతీయ అవార్డుల‌తో బ‌ల‌గం స‌త్తా చాటుతున్న‌ది.. ఇప్ప‌టికే ఉక్రెయిన్‌లో జరిగిన ఓంక్యో ఫిల్మ్ అవార్డ్స్‌ లో ఈ చిత్రం ఇప్పటికే ఉత్తమ డ్రామా ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. తాజాగా మరో 4 అవార్డులను గెలుచుకుంది. బలగం, వాషింగ్టన్ DC ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్‌ లో ఉత్తమ ఫీచర్ డైరెక్టర్ (వేణు యెల్దండి), ఉత్తమ నటుడు (ప్రియదర్శి), ఉత్తమ నటి (కావ్య కళ్యాణ్‌రామ్), ఉత్తమ కథనం (వేణు యెల్దండి) అవార్డులను గెలుచుకుంది. మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రాన్ని హర్షిత్ రెడ్డి , హన్షిత రెడ్డి నిర్మించారు. దిల్ రాజు స‌మ‌ర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement