Sunday, May 5, 2024

సెన్సార్ బోర్డ్ నే మెప్పించిన బ్యాక్ డోర్

బాలాజీ దర్శకత్వంలో హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా బ్యాక్ డోర్. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకం పై బి శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం తాజాగా సెన్సార్ బోర్డ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇవ్వటంతో పాటు దర్శక నిర్మాతల పై ప్రశంసలు కురిపించారట.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ…బ్యాక్ డోర్ సినిమాలో కుర్రకారును కట్టిపడేసే అంశాలు ఉన్నాయని అలాగే అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఉన్నాయన్నారు. పూర్ణ తో పాటు హీరో తేజ కూడా మంచిగా నటించారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement