Friday, May 17, 2024

అఫిషీయ‌ల్ గా అవ‌తార్ 2.. టైటిట్ ఇదేన‌ట‌..!

2009లో విడుదలైన అవతార్, ప్రపంచవ్యాప్తంగా $2.84 బిలియన్లు సంపాదించి టైమ్ రికార్డ్ సృష్టించింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా 2 బిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి చిత్రంగా నిలిచింది. అయితే అవ‌తార్ 2 పై ఎన్నో వార్త‌లు పుకార్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.. అయితే తాజాగా అవతార్ సీక్వెల్ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. ఈ చిత్రానికి అవతార్: ది వే ఆఫ్ వాటర్ అని పేరు పెట్టారు, చాలా సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా అన్ని సమయాలలో అత్యంత ఎదురుచూసిన విడుదలలలో ఒకటి. కొన్ని నెలల ఊహాగానాల తర్వాత, ఈ సినిమాని నిర్మిస్తున్న 20th సెంచరీ స్టూడియోస్ అధికారికంగా టైటిల్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు.

ఈ చిత్రం డిసెంబర్ 16, 2022న విడుదల కానుంది.అంతే కాకుండా సినిమాకి సంబంధించిన రెండు ఫోటోల‌ను కూడా రిలీజ్ చేశారు. 13 ఏళ్ల క్రితం రిలీజైన సినిమా కావడంతో ప్రేక్షకులకు ఉత్సాహం పెంచడానికి, 20th సెంచరీ స్టూడియో అవతార్‌ను ఫ‌స్ట్ పార్ట్ ని సెప్టెంబర్ 23న థియేటర్‌లలో విడుదల చేయ‌నున్నారు.. అంటే సీక్వెల్ వచ్చే మూడు నెలల ముందు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement