Sunday, May 5, 2024

మాస్ అవ‌తార‌మెత్తిన అర‌వింద్ స్వామి.. క‌స్ట‌డీ పోస్ట‌ర్

మాస్ అవ‌తార‌మెత్తాడు న‌టుడు అరవింద్ స్వామి. హీరోగా నాగ‌చైత‌న్య ఈ చిత్రంలో న‌టిస్తున్నాడు. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకు, ఇళయరాజా – యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. మే 12వ తేదీన ఈ సినిమాను తెలుగు – తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాజు అనే పాత్రను అరవింద్ స్వామి పోషించారనీ, ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని హీరో నాగ‌చైత‌న్య చెప్పారు. కాగా అరవింద్ స్వామి మాస్ లుక్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో … నోట్లో బీడీతో .. రఫ్ లుక్ తో అరవింద్ స్వామి ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. నిజానికి ఈ తరహా పాత్రలో ఆయన కనిపించడం తెలుగు ఆడియన్స్ కి ఇదే మొదటిసారి కావొచ్చునేమో. అంతటి అందగాడిని ఇలాంటి పాత్రలో చూడటం కష్టంగానే అనిపించినా, ఆ పాత్రను వెంకట్ ప్రభు ఎలా కనెక్ట్ చేశాడనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement