Sunday, April 28, 2024

అవలంబిక గా మారిన అర్చన

నటి అర్చన గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించిన అర్చన….ఇటీవల బిగ్ బాస్ తో మళ్ళీ స్క్రీన్ పైన కనిపించింది. అయితే ప్రస్తుతం అర్చన అవలంబిక అనే సినిమా చేస్తోంది. సుజయ్, మంజూష పొలగాని ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జి శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు.

సోషియో ఫాంటసీ హర్రర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక ఈ నెల 20న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇటీవల నాగబాబు విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని ఇందులో మొత్తం ఐదు పాటలు ఉండగా ఆదిత్య మ్యూజిక్ సంస్థ విడుదల చేసిందని అన్నారు నిర్మాత శ్రీనివాస్ గౌడ్. ఈ చిత్రంలో ఉత్కంఠకు గురిచేసే ఐదు పోరాట సన్నివేశాలు ఉన్నాయని ఉదయ్ కిరణ్ సంగీతం అందించారని తెలిపారు. మరి ఈ సినిమాతో అర్చన ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement