Thursday, April 25, 2024

నేతన్నలకు పంచెలు ఊడదీసి గోచీలు ఇస్తారా?: ఎమ్మెల్యే నిమ్మల

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కుటుంబాలకు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి సీఎం జగన్ మీట నొక్కి నేరుగా నగదు బదిలీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి రూ. 24 వేల వంతున సాయాన్ని అందించారు. కాగా పాలకొల్లు మండలం దగ్గులూరులో చేనేత కార్మికులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఈ పథకం నేతన్నకు నేస్తం కాదని… మోసం అని నిమ్మల మండిపడ్డారు.

ఏపీలో మొత్తం 3.50 లక్షల మగ్గాల కార్మికులు ఉంటే కేవలం 69 వేల మందికే ఈ పథకాన్ని ఇస్తున్నారని… ఇది నేస్తమా? మోసమా? అని ప్రశ్నించారు. చేనేత కుటుంబాలకు ప్రతి ఏటా రూ. 50 వేలు వచ్చే ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఎత్తేయడం సంక్షేమమా? అని నిలదీశారు. చేనేత కార్మికులకు పంచ ఊడదీసి, గోచీ ఇచ్చారని మండిపడ్డారు. నేతన్నలకు ఓ వైపు అన్యాయం చేస్తూ… మరోవైపు ఆర్భాటపు ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు.

ఈ వార్త కూడా చదవండి: ఓబీసీ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు

Advertisement

తాజా వార్తలు

Advertisement