Thursday, May 2, 2024

అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ.. చిరంజీవి

అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ … అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మ ని చూసే నేర్చుకున్నాం అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నేడు మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. తల్లి అంజనా దేవి, భార్య సురేఖలతో పాటు ఇద్దరు చెల్లెళ్లతో ఫోటోలు దిగారు. మహిళల ఔన్నత్యాన్ని తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. చిరంజీవి పోస్ట్ మహిళల పట్ల ఆయనకున్న గౌరవం, అభిమానం తెలియజేసేదిగా ఉంది. ముఖ్యంగా చిరంజీవి తల్లి అంజనా దేవిని అమితంగా ప్రేమిస్తారు. ఖాళీ సమయాల్లో తల్లితో గడపడం ఆయనకు ఇష్టమైన వ్యాపకం. ఆమెకు ఇష్టమైన వంటకాలు స్వయంగా చేసి వడ్డిస్తారు. చిరంజీవి మదర్స్ డే పోస్ట్ వైరల్ గా మారింది. నాగబాబు కూడా మదర్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఫోటోలకు పోజులిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement