Wednesday, May 1, 2024

ఐబి ఆఫీసర్‌ రాఘవేంద్ర రాజ్‌పుత్‌…

మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘-టైగర్‌ నాగేశ్వరరావు’ టీ-జర్‌ విడుదల కానుండడంతో మరో మూడు రోజుల్లో -టైగర్‌ దండయాత్ర మొదలుకానుంది. వంశీ దర్శకత్వంలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’, ‘కార్తికేయ 2’ తర్వాత మేకర్స్‌ నుంచి వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. టీ-జర్‌ను విడుదల చేయడానికి ముందు మేకర్స్‌ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు.

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ -టైగర్‌ నాగేశ్వరరావులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐబి ఆఫీసర్‌ రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా పరిచయం అయ్యారు అనుపమ్‌ ఖేర్‌.

-టైగర్‌ నాగేశ్వరరావు రవితేజకు హయ్యెస్ట్‌ బడ్జెట్‌ సినిమా. కథకు యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్నందున, దీనిని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, సంగీతం జివి ప్రకాష్‌ కుమార్‌ అందిస్తున్నారు. అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌. శ్రీకాంత్‌ విస్సా సంభాషణలు కాగా, మయాంక్‌ సింఘానియా సహ నిర్మాత.

- Advertisement -

రవితేజ సరసన నూపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్‌ 20న విడుదల కానుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement