Saturday, May 18, 2024

బాలయ్య అనిల్ సినిమాపై మరో అప్డేట్!!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇదిలా ఉండగా బాలకృష్ణ అనిల్ రావిపూడి తో ఓ సినిమా చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే బాలయ్యతో సంప్రదింపులు కూడా జరిగిపోయాయట. ఇక అక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ తో పాటు ఫన్ తో సాగే ఈ సినిమాలో అనిల్ రావిపూడి తన మార్కును చూపించబోతున్నాడట. ఇక అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement