Friday, May 17, 2024

నితిన్ ‘మాస్ట్రో’ నుంచి కొత్త పోస్టర్

ఇటీవల రంగ్ దే సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు హీరో నితిన్. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. తన కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ సాధించిన అంధాదున్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా శ్రీరామనవమి సందర్భంగా చిత్ర యూనిట్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో నితిన్ నభా నటేష్ వెనుక కూర్చొని స్కూటీపై వెళ్తూ కనిపించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ అందుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ సినిమాలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement