Friday, April 26, 2024

రీ-రిలీజ్ లిస్ట్‌లో మ‌రో మూవీ.. థియేట‌ర్ల‌లో రీఎంట్రీకి రెడీ అవుతున్న గుడుంబా శంకర్

స్టార్ హీరోల రీ-రిలీజ్ ల ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ లో జోరుగా కొనసాగుతోంది. తమ స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతుండటం తో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. జల్సా, ఖుషీ సినిమాల రీ-రిలీజ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ మూవీ గుడుంబా శంకర్ థియేట‌ర్ల‌లో రీఎంట్రీ ఇవ్వాడానికి రెడీ అవుతోంది.

ఈ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ-రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ న్యూస్ తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మించిన ఈ చిత్రానికి వీర శంకర్ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ సరసన మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా, ఆశిష్ విద్యార్థి ఈ చిత్రం లో కీలక పాత్రలో నటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement