Sunday, May 5, 2024

మరో లెవెల్…ఫస్ట్ డే తిమ్మరుసు కలెక్షన్స్

హీరో సత్యదేవ్ హీరోగా శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా తిమ్మరుసు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో పాటు సృజన్‌ ఎరబోలు నిర్మాణం లో తెరకెక్కిన చిత్రం కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తొలి రోజుకు గాను మొత్తం 47 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 27 లక్షల రూపాయల షేర్ వచ్చిందని కూడా సమాచారం. అయితే కరోనా సమయంలో సత్యదేవ్ లాంటి నార్మల్ హీరోకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావటం గొప్ప విషయం అంటున్నారు సినీ అభిమానులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement