Monday, May 6, 2024

శ్రీనివాస్ రెడ్డి మరో సినిమా కూడా ఈ నెలలోనే రిలీజ్

ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన శ్రీనివాస్ రెడ్డి… గీతాంజలి సినిమా తో హీరోగా మారాడు. ఆ తర్వాత జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలో నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించాయి. తాజాగా శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన మరో సినిమా ముగ్గురు మొనగాళ్ళు ఈ నెల 6వ తేదీన విడుదల కాబోతున్నాయి.

అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగస్టు 20వ తేదీన శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన మరో చిత్రం ప్లాన్ బి రిలీజ్ కాబోతుంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు /ఎ సర్టిఫికెట్ లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement