Sunday, April 28, 2024

బాలయ్య లైనప్ లో మరో డైరెక్టర్ ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

అయితే తాజాగా డైలాగ్ రైటర్ ఎమ్ రత్నం బాలకృష్ణ కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారట. ఇప్పటికే ఆ కథను బాలయ్యకు కూడా వినిపించినట్లు తెలుస్తోంది. బాలయ్య కూడా ఓకే చెప్పారట. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించబోతున్నాడట. మరి చూడాలి దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement