Friday, April 26, 2024

స్టార్ హీరోలందరితో సినిమాలు చేయాలి..అనిల్ రావిపూడి..

తెలుగులోని స్టార్ హీరోలందరితోను సినిమాలు చేయాలనుంద‌ని చెప్పారు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి..ఎఫ్ 3 చిత్రం గురించి మాట్లాడుతూ..ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేద్దామని నేను .. దిల్ రాజుగారు భావించాము. కానీ సోలో రిలీజ్ గా వస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాం. ఈ సినిమాలో హీరోలు వెంకటేశ్ – వరుణ్ తేజ్ పాత్రలను డిజైన్ చేసిన తీరు చాలా ఫన్ గా ఉంటుంది. రే చీకటి గల పాత్రలో వెంకీ .. నత్తి ఉన్న పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లోని సీన్స్ ఒక రేంజ్ వచ్చాయి. థియేటర్స్ లో ప్రేక్షకులు పడి పడి నవ్వుకుంటారు. ‘ఎఫ్ 3’ తరువాత కూడా ఈ ఫ్రాంఛైజీ కొనసాగుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement