Friday, April 26, 2024

అనగనగా ఒక రౌడీ షూటింగ్ కంప్లీట్

టాలీవుడ్ లో అడుగుపెట్టి చాలా ఏళ్లు గడుస్తున్నా… సరైన స్టార్డమ్ తెచ్చుకోలేకపోయాడు హీరో సుమంత్. 1,2 హిట్లు ఉన్నప్పటికీ అవి అంత పేరును తీసుకురాలేకపోయాయి. ప్రస్తుతం మను యజ్ఞ దర్శకత్వంలో అనగనగా ఒక రౌడీ సినిమా చేస్తున్నాడు సుమంత్.

విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్ వాల్తేరు వాసు గా కనిపించనున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సుమంత్ కన్ఫర్మ్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నట్లు తెలిపాడు. ఇక ఈ సినిమాకు రాబిన్ సంగీతం అందిస్తుండగా… వినీత్ భట్, గార్లపాటి రమేష్ నిర్మాణం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement