Friday, May 10, 2024

Harihara Veeramallu డిజిటల్ పార్టనర్ ఫిక్స్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘‘హరిహర వీరమల్లు’’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి తాజాగా డిజిటల్ పార్టనర్ ఫిక్స్ అయింది. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది.

ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. ఇక బాబీ డియోల్, నిధి అగర్వాల్, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ.దయాకర్‌రావు ఈ సినిమానిక నిర్మిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement