Saturday, October 12, 2024

Alia Bhatt : మళ్లీ గ్లామర్ షోకి అలియా భట్ రెడీ..

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ అలియా భట్. మహేష్ భట్ కూతురుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది. గత ఏడాది ఈ అమ్మడు ఆర్ఆర్ఆర్, గంగుభాయ్, బ్రహ్మాస్త్ర సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చి హ్యాట్రిక్ హిట్స్ ని ఖాతాలో వేసుకుంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు రణబీర్ కపూర్ ని గత ఏడాది వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. ప్రస్తుత మాతృత్వాన్ని ఆశ్వాదిస్తున్న ఈ అమ్మడు కొన్ని నెలలు విరామం ఇచ్చి మరల మ్యాకప్ వేసుకుంది. ఈ మధ్య రెగ్యులర్ గా హాట్ ఫోటోషూట్ లతో సెగలు రేపుతుంది. ఈ ఫోటోలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్ ముద్దుగుమ్మల అందాల ప్రదర్శన ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక స్టార్ హీరోయిన్ అయిన కూడా అలియా భట్ మరల సినిమాలలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలోనే గ్లామర్ షోకి తెరతీసింది. హాట్ హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఆప్ ఫ్రాక్ తో చేసిన ఫోటోలు వేడి పుట్టిస్తున్నాయి.. ఈ ఫోటోలు కాస్తా ఇప్పుడు వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement