Sunday, April 28, 2024

బరువు తగ్గించే పనిలో అలియాభట్!! ఎందుకో తెలుసా ?

కరోనా కారణంగా చాలా సినిమాలు షూటింగ్ ను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ ఆర్ సినిమా కూడా నిలిచిపోయింది. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నాడు. అయితే ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియాభట్ సీత పాత్రలో కనిపించబోతున్నారు.

అయితే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు జక్కన్న రెడీ అవుతున్నాడు. స్టార్ట్ చేసిన వెంటనే అలియాభట్ రామ్ చరణ్ ల మధ్య ఓ స్పెషల్ సాంగ్ ను తెరకెక్కించాల్సి ఉందట. అయితే ఈ సాంగ్ కోసం అలియాభట్ ని బరువు తగ్గమని రాజమౌళి చెప్పాడట. దీంతో జిమ్ లో వెయిట్ తగ్గించే పనిలో అలియాభట్ పడినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే ఈ అమ్మడు కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement