Tuesday, September 21, 2021

సమంత చేతులమీదుగా…అలీ కొత్త సినిమా పాట రిలీజ్

అలీ ప్రధాన పాత్రలో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. అయితే ఈ సినిమాను అలీ సమర్పణలో మోహన్ కొణతాల, బాబా అలీ, శ్రీ చరణ్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలోని మూడో పాటను స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత విడుదల చేశారు. కాగా ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ… నాకు వాస్తవం తో కూడిన జీవిత కథలు అంటే ఎంతో ఇష్టం. అలాంటి స్టోరీతో అలిగారు నిర్మిస్తున్న మొదటి చిత్రం అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. ఇది మంచి హిట్ అవ్వాలని కోరారు సమంత.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే… సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా చేస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News