Sunday, April 28, 2024

ఎఫ్3 సెట్ లో అలీ హోమ్ మేడ్ బిర్యానీ

అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఎఫ్3. గతంలో లో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్…ఇటీవలే రీ స్టార్ట్ అయింది. కాగా తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి సెట్ లో జరిగిన ఓ బ్యూటిఫుల్ మూమెంట్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

స్టార్ కమెడియన్ అలీ ఇంట్లో స్వయంగా తయారు చేసిన బిర్యాని తమ కోసం తీసుకువచ్చి వడ్డించారని… చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటిస్తున్నారు. అలాగే దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

https://www.instagram.com/p/CRI2JlbM5x6/?utm_medium=copy_link

Advertisement

తాజా వార్తలు

Advertisement