Sunday, May 5, 2024

ఎన్టీఆర్ తండ్రే అజయ్ దేవగన్ ?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్స్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ శ్రియ, విలక్షణ నటుడు సముద్రఖని కూడా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఇప్పుడు అజయ్ దేవగన్ రోల్ గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియ రావట్లేదు. ఇక మామూలుగా నిజ జీవితంలో కొమరం భీమ్ తండ్రి ఓ గొప్ప పోరాట యోధుడు. కానీ అటవీ అధికారుల చేతుల్లో కొమరం భీమ్ కు 15 ఏళ్ల వయస్సు ఉన్న సమయంలో బలైపోయాడు. ఆ సంఘటన కారణంగానే కొమరం భీమ్ లో విప్లవాత్మక ఆలోచనలు పుట్టి పోరాటాలు స్టార్ట్ చేశాడట.

Advertisement

తాజా వార్తలు

Advertisement