Thursday, May 2, 2024

Ahimsa – చాలా కీలకపాత్రలోనటించా….గీతికా తివారి

వెండితెరకు కొత్తవారిని పరిచయం చేయడంలో దర్శకుడు తేజ ఎప్పుడూ ముందుంటారు. ఆయన తెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించారు. తాజాగా దర్శకుడు అహింస అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అభిరామ్‌ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. జూన్‌ 2న ఈ చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్‌ గీతికా తివారీ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

మీ నేపథ్యం ఏమిటీ?
మాది మధ్య ప్రదేశ్‌, జబల్పూర్‌. గ్రాడ్యుయేషన్‌ తర్వాత కెరీర్‌ మొదలు పెట్టాను. మొదట కొన్ని కమర్షియల్‌ యాడ్స్‌ చేశాను. తర్వాత సినిమాల్లోకి రావాలకున్నా . నాకు టాలీవుడ్‌ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆడిషన్స్‌ ఇచ్చే క్రమం లో తేజ గారిని కలిశాను. ఆడిషన్స్‌ ఇచ్చాను, ఎంపికయ్యాను.
కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
తేజ గారు మొదట నాకు కథ మొత్తం చెప్పలేదు. నేను చేసిన అహల్య పాత్ర గురించి చెప్పారు. చాలా కీలకమైన పాత్ర. తను చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. ఆ పాత్ర ప్రయా ణం నాకు చాలా నచ్చింది. ఛాలెంజింగా అనిపించింది.
అభిరామ్‌ తో వర్క్‌ చేయడం ఎలా అనిపించిది ?
అభిరామ్‌ మల్టీ టాలెం-టె-డ్‌. చాలా హార్డ్‌ వర్క్‌ చేస్తారు. తేజగారు ఎన్ని టేక్స్‌ తీసుకున్నా సరే.. పెర్ఫెక్ట్‌ గా వచ్చే వరకు చాలా ఓపికతో వుంటారు. అభిరామ్‌ గుడ్‌ కోస్టార్‌.
ఆర్పీ పట్నాయక్‌ గారి మ్యూజిక్‌ గురించి ?
అహింసలో వండర్‌ఫుల్‌ మ్యూజిక్‌ వుంది. ఇందులో నాలు గు పాటలున్నాయి. పాటలన్నీ చాలా బావొచ్చాయి. ఇందు లో నీతోనే నీతోనే పాట నా ఫేవరేట్‌. నాకు డ్యాన్స్‌ అంటే ఇ ష్టం.
అహింసలో మిగతా నటీ-నటు-లు గురించి ?
అహింసలో సదా గారు అడ్వకేట్‌ పాత్రలో కనిపిస్తారు. చాలా బలమైన పాత్ర. అలాగే రజత్‌ బేడీ, మనోజ్‌ -టైగర్‌ బల మైన ప్రతినాయకులుగా కనిపిస్తారు.
షూటింగ్‌ గ్రామాల్లో జరిగిందా ?
అహింస షూటింగ్‌ 90 శాతం మధ్య ప్రదేశ్‌ లోని అడవీ ప్రాంతంలో జరిగింది. చాలా ఇం-టె-న్స్‌ లోకేషన్స్‌ కనిపిస్తా యి. యూనిట్‌ అంతా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement