Friday, May 17, 2024

ఆదిపురుష్ టీజ‌ర్ రిలీజ్‌.. శ్రీ‌రాముడిగా ప్ర‌భాస్ అదుర్స్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న స‌మ‌యం వ‌చ్చేసింది ! రెబ‌ల్‌స్టార్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఆదిపురుష్ సినిమా టీజ‌ర్ రిలీజైంది. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రామాయ‌ణం ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా టీజ‌ర్‌ను అయోధ్య వేదిక‌గా ఆదివారం సాయంత్రం మేక‌ర్స్ విడుద‌ల చేశారు. 1:46 నిమిషాల నిడివి గ‌ల ఈ టీజ‌ర్ ఆడియ‌న్స్‌కు కొత్త అనుభూతి క‌లిగిస్తుంది. అద్భుత‌మైన గ్రాఫిక్స్‌తో ఉన్న ఈ వీడియోను చూస్తుంటే.. సినిమా విజువ‌ల్ వండ‌ర్‌గా ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది.

ప్రభాస్‌ అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎంత గానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపుల తర్వాత ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. అయితే షూటింగ్‌ పూర్తయి నెలలు గడుస్తున్న సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు రాకపోవడంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ మేకర్స్‌పై చాలారోజులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఈ ఫ‌స్ట్‌లుక్ చూసి ఫ్యాన్స్ మురిసిపోగా.. కొంత‌మంది మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఈ రెస్పాన్స్ చూసి అసలు టీజ‌ర్ ఎలా ఉంటుందా అని చాలామంది ఆత్రుత‌గా ఎదురుచూశారు. కానీ తాజాగా రిలీజ్ చేసిన ఆదిపురుష్ టీజ‌ర్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పించేలా ఉంది. బాహుబ‌లి త‌ర్వాత ఆ రేంజ్‌లో ఈ సినిమా ఎంట‌ర్‌టైన్ చేయడం ఖాయ‌మ‌ని ఫిక్స‌వుతున్నారు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌.

కృతి సనన్‌ సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి పాత్రను పోషిస్తున్నారు. టీ సిరీస్‌, రెట్రోఫైల్స్‌ పతాకాలపై భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నుంచి వంశీ, ప్రమోద్‌ నిర్మాణంలో భాగమవుతున్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement