Wednesday, May 1, 2024

అదా శ‌ర్మ లేటెస్ట్ మూవీ అప్డేట్.. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన మేక‌ర్స్

సుదీప్తో సేన్ రచన, దర్శకత్వంలో న‌టి అదా శ‌ర్మ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘‘ది కేర‌ళ స్టోరీ’’. ఈ అప్ క‌మింగ్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది అదా శ‌ర్మ‌. ఇక, ఈ సినిమా వ‌చ్చే నెల.. మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేస్తూ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు మేక‌ర్స్.

అదా శ‌ర్మ కూడా త‌న‌ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ఈ పోస్ట‌ర్ ని షేర్ చేసింది. రియ‌ల్ లైఫ్ ఇన్సిడెట్స్ ఆధారంగా తెర‌కెక్కి ఈ సినిమాలో.. సిద్ధి ఇద్నాని, యోగితా బిహానీ, సోనియా బలానీ, విజయ్ కృష్ణ ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృతలాల్ షా ఈ సినిమాని నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement