Sunday, May 19, 2024

సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్.. తొలిసారిగా నెగిటివ్‌ రోల్..

ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్‌ హీరోలతో జత కట్టిన సిమ్రాన్ సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేయనుందట. తాజాగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో కార్తి నటిస్తున్న “సర్దార్” అనే చిత్రంలో నెగిటివ్‌ రోల్‌ చేయనుందనే ప్రచారం జరగుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సిమ్రాన్‌ పాత్ర ఈ సినిమాలో కీలకంగా మారుతుందని టాక్‌ వినిపిస్తోంది. పిఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement