Wednesday, May 1, 2024

సాహో నటి ఇంట విషాదం

బాలీవుడ్ నాట మరో విషాదం నెలకొంది. నటి, ప్రముఖ యాంకర్ మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. కాగా రాజ్ కౌశల్ మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక మందిరా బేడీ కొన్ని బాలీవుడ్ చిత్రాలతో పాటు సీరియల్స్ లో కూడా నటించారు. ఇక రీసెంట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమాలో నటించారు.

మందిరా బేడీని 14 ఫిబ్రవరి 1999న రాజ్ కౌషల్‌ పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికి 2011న వీర్ అనే ఓ బాబు పుట్టాడు. అలాగే 2020 అక్టోబర్‌లో 4 సంవత్సరాల అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

గని కష్టం మాములుగా లేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement