Wednesday, April 24, 2024

గని కష్టం మాములుగా లేదు

గద్దలకొండ గణేష్ సినిమా తో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో గని సినిమా చేస్తున్నాడు వరుణ్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా జూలై 30న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలు కొన్ని రోజుల్లోనే చిత్రీకరించనున్నారు. అందుకుగాను జిమ్ లో కష్టపడుతున్నాడు వరుణ్. అందుకు సంబంధించిన ఒక వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటిస్తుండగా… కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తోపాటు జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

హరీష్ శంకర్ కే పంచ్ డైలాగ్ వేసిన నెటీజన్

https://www.instagram.com/p/CQtB5S-jyJK/?utm_source=ig_web_copy_link
Advertisement

తాజా వార్తలు

Advertisement