Thursday, May 16, 2024

యాక్ష‌న్ స‌న్నివేశాలు.. రిక‌వ‌రీ కావ‌డానికి ఐస్ బాత్ చేస్తోన్న స‌మంత‌

స్టార్ హీరోయిన్ స‌మంత హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ లో పాల్గొంటూ అలసిపోతుంద‌ట‌. రికవరీ కావడానికి ఐస్ బాత్ చేస్తుందట. అయితే ఈ ట్రీట్మెంట్ టార్చర్ లా ఉందట. ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం పొందాలంటే తప్పదని సమంత చెప్పకనే చెప్పారు. సిటాడెల్ యాక్షన్ సిరీస్. సమంత కఠినతరమైన స్టంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య రెండు చేతులకు గాయాలైన ఫోటోలు సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరి ఇంత కష్టపడుతున్న సమంతకు సిటాడెల్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. బోల్డ్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని సమాచారం. శృంగార సన్నివేశాల్లో నటించేందుకు చాలా ఇబ్బందిపడ్డానని ప్రియాంక చోప్రా నేరుగా చెప్పారు. ఏప్రిల్ 28 నుండి సిటాడెల్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ క్రమంలో వరుణ్ ధావన్-సమంత మధ్య ఆ తరహా సన్నివేశాలు ఉండనున్నాయి. అయితే ఇండియన్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని డోసు కొంచెం తగ్గించి ఉండవచ్చు. సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement