Wednesday, May 1, 2024

అదరగొడుతున్న ‘ఆచార్య’ లాహే లాహే !!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

ఇదిలా ఉండగా ఇటీవల లాహే లాహే సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో చిరంజీవి అదిరిపోయే స్టెప్స్ వేస్తూ కనిపించాడు. కాగా ఈ సాంగ్ ఇప్పటివరకు 25 మిలియన్ల వ్యూస్ ను సంపాదించింది. అయితే ఈ సాంగ్ సినిమా రిలీజ్ కాకముందే ఈ స్థాయిలో అలరించడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని మే 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఆగస్టు లో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement