దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతిరోజు లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కరోనా బారినపడి ఓ యువతి ఆస్పత్రిలో చేరింది. కాగా తన సోదరి పరిస్థితిని తెలుపుతూ ఓ యువకుడు రెమ్‌డెసివిర్ మెడిసిన్ కావాలంటూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా అభ్యర్థించాడు.
అయితే ఆ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్… ఏపీ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ కు ఈ విషయాన్ని తెలిపారు. వెంటనే కేటీఆర్ సూచన మేరకు మేకపాటి గౌతమ్ కు అవసరమైన సహాయాన్ని వెంటనే అందించారు. దీనిపై బాధితులు స్పందిస్తూ… ఇరు రాష్ట్రాల మంత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కేటీఆర్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.